విశ్వసనీయ యాప్‌ల జాబితాను ప్రకటించిన గూగుల్

by sudharani |
విశ్వసనీయ యాప్‌ల జాబితాను ప్రకటించిన గూగుల్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19కి సంబంధించి తప్పుడు సమాచారం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. వైరస్ సోకకముందే సోకిందంటూ వార్తలు రావడం, కచ్చితమైన సమాచారం లేకపోవడం వల్ల తలెత్తుతున్న సమస్యలు అధికారులకు లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ తమ ప్లేస్టోర్‌లో నమ్మశక్యమైన కచ్చితమైన విశ్వసనీయ సమాచారాన్ని ఇచ్చే యాప్‌ల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో కేవలం మూడే యాప్‌లు ఉండటం గమనార్హం.

కరోనా వైరస్ స్టే ఇన్ఫార్మ్‌డ్ పేరుతో ప్రకటించిన ఈ జాబితాలో ఆరోగ్య సేతు, ట్విట్టర్, ఇన్‌షార్ట్స్ యాప్‌లు ఉన్నాయి. ఆరోగ్యసేతు యాప్‌ను భారత ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు. ఇందులో కొవిడ్ 19 హెల్ప్ సెంటర్ల వివరాలు, సెల్ఫ్ అసెస్‌మెంట్, కాంటాక్టు ట్రేసింగ్ అంశాలు ఉంటాయి. ఇక ట్విట్టర్‌లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హ్యాండిల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ హ్యాండిల్ ద్వారా అధికారిక సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే ఇన్‌షార్ట్స్ అనే న్యూస్ యాప్‌లో వివిధ వార్తా వెబ్‌సైట్లు, ఛానళ్లలోని ప్రధాన వార్తలను సంక్షిప్తంగా తెలుసుకోవచ్చు. వీటితో పాటు అధికారిక వార్తల కోసం తెలుగులో దిశ యాప్, దిశ వెబ్‌సైట్‌ని కూడా ఫాలో అవ్వొచ్చు.

Tags: Corona, COVID 19, Disha App, Google, Arogya Setu, Twitter, Inshorts

Advertisement

Next Story