ముంబై ముందు భారీ స్కోర్

by Anukaran |
ముంబై ముందు భారీ స్కోర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 11వ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్(52), దేవదత్ పడిక్కల్(54) తలో హాఫ్ సెంచరీ పూర్తి చేసి మంచి ఇన్నింగ్స్ ఆడారు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ కాసేపు కూడా క్రీజులో నిలబడలేదు. 11 బంతులు ఆడి కేవలం 3 పరుగుల పేలవ ప్రదర్శన చేసి పెవిలియన్ బాట పట్టాడు.

కానీ, మిడిలార్డర్‌లో వచ్చిన ఏబీ డివిలియర్స్ (55) పరుగులతో 360 డిగ్రీస్ ఇన్నింగ్స్‌ మరోసారి ప్రదర్శించాడు. కేవలం 25 బంతుల్లోనే 55 పరుగులు చేసి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. చివరిలో వచ్చిన శివం దూబె 10 బంతుల్లో 25 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ చేశాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 201 పరుగులు చేసింది.

స్కోర్‌ బోర్డ్:
Royal Challengers Bangalore: దేవదత్ పడిక్కల్ (c) పొలార్డ్ (b) ట్రెంట్ బోల్ట్ 54(40) ఆరోన్ ఫించ్ (c) పొలార్డ్ (b) బోల్ట్ 52 (35), విరాట్ కోహ్లీ (c)రోహిత్ శర్మ (b) రాహుల్ చాహర్ 3(11), ఏబీ డివిలియర్స్ 55 (25), శివం దూబే నాటౌట్ 27(10) ఎక్స్‌ట్రాలు 10, మొత్తం స్కోరు: 201/3

వికెట్ల పతనం: 81/1 (ఆరోన్ ఫించ్, 8.6), 92/2 (విరాట్ కోహ్లీ, 12.2), 154/3 (దేవదత్ పడిక్కల్, 17.1)

బౌలింగ్: ట్రెంట్ బోల్ట్ 4-0-34-2, జేమ్స్ ప్యాటిన్సన్ 4-0-51-0, రాహుల్ చాహర్ 4-0-31-1, జస్ప్రీత్ బుమ్రా 4-0-42-0, క్రునాల్ పాండ్యా 3-0-23-0, కీరన్ పొలార్డ్1-0-13-0.

Advertisement

Next Story

Most Viewed