హైదరాబాద్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తోన్న రోడ్లు

by Anukaran |   ( Updated:2021-10-08 10:52:01.0  )
Heavy rain
X

దిశ, అంబర్‌పేట్: హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, ఎల్బీనగర్, రామ్‌నగర్‌, పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట్‌, సైదాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌ మెట్‌, అనాజ్‌పూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్, మాదాపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడి, వాహనదారుల అవస్థలు పడ్డారు. ముఖ్యంగా అంబర్‌పేట్ నియోజకవర్గంలోని అంబర్ పేట్, నల్లకుంట, బర్కత్‌పుర, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.

లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు డ్రైనేజీల్లో చేరడంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై నీళ్లు మోకాళ్ల లోపు నిలిచిపోవడంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాగా, రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపడంతో జీహెచ్‌ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, GHMC, DRF, అత్యవసర విభాగాలు సహాచక చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed