ఈ భారీ సూచన మనకే

by Shyam |   ( Updated:2020-06-12 09:43:47.0  )
ఈ భారీ సూచన మనకే
X

దిశ, న్యూస్ బ్యూరో: నైరుతి రుతుప‌వ‌నాలు, అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో శనివారం నుంచి ఆదివారం వరకు తెలంగాణ‌, గోవా రాష్ట్రాల‌తోపాటు కొంక‌ణ్‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావ‌ర‌ణ కేంద్రం (ఐఎండీ) వెల్ల‌డించింది. మ‌ధ్య మ‌హారాష్ట్ర‌, మ‌ర‌ఠ్వాడా, కోస్తాంధ్రా, యానాం, ఉత్తర క‌ర్ణాట‌క‌, విద‌ర్భ‌, అసోం, మేఘాల‌యాల్లో కూడా వ‌చ్చే 24 గంట‌ల వ్య‌వ‌ధిలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావం వ‌ల్ల మ‌ధ్య అరేబియా స‌ముద్రంలో కొన్ని ప్రాంతాలు, మ‌హారాష్ట్ర‌లో ముంబై స‌హా ప‌లు ప్రాంతాలతోపాటు ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల్లో, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ద‌క్షిణ గుజ‌రాత్‌, ద‌క్షిణ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌, బీహార్ రాష్ట్రాల్లోని మ‌రికొన్ని ప్రాంతాల్లో రాగ‌ల 48 గంట‌ల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed