శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

by Sumithra |
foreign currency
X

దిశ, రాజేంద్రనగర్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా విదేశీ కరెన్సీని విదేశాలకు తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అధికారులు పట్టుకున్నారు. సీఐఎస్ఎఫ్ అధికారుల వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్‌కి వెళ్ళడానికి ఓ ప్రయాణికుడు ఎయిర్ పోర్ట్‌కి వచ్చాడు. తన లగేజీలో నిబంధనలకు విరుద్ధంగా సౌదీ అరేబియాకు చెందిన విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తుండగా స్కానింగ్ వద్ద ఏఐఎస్ఎఫ్ అధికారులు గుర్తించి, కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని, అతని వద్దనున్న విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.17 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story