కుక్కను దారుణంగా హింసించి చంపిన యువకులు

by Shyam |   ( Updated:2021-07-02 02:45:53.0  )
#JusticeForBruno
X

దిశ, సినిమా: కేరళలో ముగ్గురు యువకులు లాబ్రడార్ డాగ్‌ను దారుణంగా హింసించి చంపిన వీడియో ఇంటర్నెట్‌ను షాక్‌కు గురిచేసింది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కాగా.. జస్టిస్ ఫర్ బ్రూనో(#JusticeForBruno) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించేందుకు మరింత కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

జంతువులను హింసించడం ఆపాలన్న హీరోయిన్ దిశా పఠాని.. ఈ గ్రహం మీద జీవిస్తున్న ప్రతీ జంతువుకు మానవుల చేత ప్రేమించబడే అర్హత ఉందని తెలిపింది. ఇక ఈ ఇన్సిడెంట్ తనను షాక్‌కు గురిచేసిందన్న పార్వతి తిరువొతు.. ఇంత వాయిలెన్స్‌కు పాల్పడుతున్న వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని అభిప్రాయపడింది. మహిళలు, పిల్లల విషయంలో ఇదే రిపీట్ చేయరని గ్యారంటీ లేదు కదా అంటూ.. ఇలాంటి ఘటనలు చూసి రెండు మూడు రోజులకు మరిచిపోయే కన్నా సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలని కోరింది పార్వతి. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తారని అనుకుంటున్నానన్న టైగర్ ష్రాఫ్.. మూగజీవాలను హింసించడం క్షమించరానిదని చెప్పాడు. ఈ విషయంపై స్పందించిన యాంకర్ రష్మీ గౌతమ్.. మనుషులు, మానవత్వం అనే పదాలు వింటుంటే సిగ్గు అనిపిస్తుందని తెలిపింది. ఇంత దారుణంగా తన జీవితాన్ని ముగించేందుకు లాబ్రడార్ ఏం తప్పు చేసిందని ప్రశ్నించింది.

Advertisement

Next Story

Most Viewed