అనంతాసనంతో వృక్షాసనం ప్రయోజనాలేంటి?

by Hamsa |
అనంతాసనంతో వృక్షాసనం ప్రయోజనాలేంటి?
X

దిశ, ఫీచర్స్: మొదటగా బల్లపరుపు నేలపై వెల్లకిలా పడుకోవాలి. తర్వాత శరీరాన్ని కుడి వైపుకు తిప్పి ఎడమ కాలిని కుడి కాలిపై సమాంతరంగా పెట్టాలి. ఇప్పుడు కుడి చేతిని తలపైకి నిటారుగా చాచి, ఎడమ మోకాలిని వంచి ఎడమ చేతితో పట్టుకోవాలి. అలా నెమ్మదిగా ఎడమ పాదాన్ని పిరుదుల దగ్గరకు తీసుకొచ్చి కుడి తొడ‌పై పెట్టాలి. తర్వాత రెండు చేతులను తలపైగా నమస్కారం చేస్తున్న పద్ధతిలో జోడించాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి మళ్లీ ఎడమ వైపు తిరిగి చేయాలి. చివరగా పూర్వ స్థితిలో రిలాక్స్ అవ్వాలి.

ప్రయోజనాలు :

* శరీరంలో చురుకుదనం, ఏకాగ్రతను పెంచుతుంది.

* న్యూరోమాస్కులర్ కోఆర్డినేషన్‌ను మెరుగుపరుస్తుంది

* సయాటికా నొప్పితో బాధపడేవారికి ఉపశమనం.

* తొడలు, కాళ్ళను బలపరిచి తుంటిని తెరుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed