- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూఎస్‌లో హాట్ టాపిక్‌గా మారిన గర్భనిరోధక మాత్రలు
దిశ, ఫీచర్స్: మిఫిప్రిస్టోన్ పిల్స్.. ప్రస్తుతం యూఎస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వీటిని ఆర్‌యూ 486 అని అని కూడా పిలుస్తారు. సంతానాన్ని వాయిదా వేసుకునేవారు. అన్ వాంటెడ్ ప్రెగ్నెన్సీ బాధితులు వీటిని వాడటం ద్వారా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవడం ఆగిపోతుంది. ఫలితంగా గర్భం రాదు. ఒకవేళ అప్పటికే గర్భం దాల్చి ఉంటే గనుక అబార్షన్ అవుతుంది. అయితే వీటి వాడకం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వాటి గురించి అమెరికాకు చెందిన రెండు కోర్టులు భిన్నమైన తీర్పు ఇవ్వడమే ఇందుకు కారణం. టెక్సాస్ కోర్టు మిఫిప్రిస్టోన్ ట్యాబ్లెట్లను వాడొద్దని హెచ్చరించగా, వాషింగ్టన్ కోర్టు మాత్రం ఇష్టమైనవారు వాడొచ్చని సూచిస్తూ, వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు కూడా మెడికల్ షాపులకు పర్మిషన్ ఇచ్చింది.
దుష్ప్రభావాలు
సంతానం వద్దనుకునే మహిళలు భాగస్వామితో సెక్స్‌లో పాల్గొన్న అనంతరం మిఫిప్రిస్టోన్ పిల్స్ వేసుకుంటారు. సంభోగం తర్వాత 48 గంటల లోపు వరకు ఎప్పుడు వేసుకున్నా ఇవి ప్రభావం చూపుతాయి. గర్భధారణకు కారణమయ్యే అండాలు విచ్ఛిన్నమై బ్లీడింగ్ రూపంలో బయటకు వెళ్తాయి. మిఫిప్రిస్టోన్, మిఫిస్ట్రాన్, మిసోప్రోస్టోల్ అనే అబార్షన్ పిల్స్ వాడేందుకు అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ 2000 సంవత్సరంలో పర్మిషన్ ఇచ్చింది. గర్భం నిలిచిన తర్వాత 10 వారాల వ్యవధి వరకు కూడా వాడొచ్చని పేర్కొంది. ఈ సమయం మించితే గర్భవిచ్ఛితి జరిగే అవకాశం ఉండదు. అప్పుడు వాక్యూమ్ యాస్పిరేషన్ పద్ధితో గర్భాన్ని తొలగిస్తారు. 2020లో సుమారు 10 లక్షల మంది అమెరికన్ మహిళలు అబార్షన్ చేయించుకున్నారని, దాదాపు 53 శాతం మంది మిఫిప్రిస్టోన్ పిల్స్ వాడారని నివేదికలు చెప్తున్నాయి.
అబార్షన్ కోసం వాడే మిఫిప్రిస్టోన్ పిల్స్ వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కండరాల తిమ్మిరి, క్రానిక్ డిసీజెస్ సంభవిస్తాయని, కొందరిలో ఎక్కువగా రక్తస్రావం జరిగి ఇబ్బందులు తలెత్తవచ్చని చెప్తున్నారు. మరి కొంతమందిలో ఫీవర్, వికారం, వాంతులు వంటివి కనిపించవచ్చు. అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ రిపోర్టు ప్రకారం.. మిఫిప్రిస్టోన్ పిల్స్ తీసుకునే ప్రతీ వంద మందిలో ఒకరు అధిక బ్లీడింగ్ సమస్యతో సర్జికల్ ట్రీట్ మెంట్‌కు రెఫర్ చేయబడుతున్నారు.