ఇన్ఫ్లూయేంజా వైరస్ రాకూడదంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాలి?

by Hamsa |   ( Updated:2023-03-20 09:00:28.0  )
ఇన్ఫ్లూయేంజా వైరస్ రాకూడదంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాలి?
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ప్రపంచమంతటా కరోనా అల్లకల్లోలం సృష్టించింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు కోలుకుంటుండగా కొత్త కొత్త వైరస్‌లు వ్యాప్తి చెందుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా, చాలా మంది ఇన్ఫ్లూయెంజా అనే ఫ్లూ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గుతో చాలా మంది బాధపడుతున్నారు. మరి కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఈ వైరస్ కళ్ళు, ముక్కు, నోటి ద్వారా వ్యాపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి సోకకుండా ఆహారంలో వీటిని భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* దాల్చిన చెక్కను ఆహారంలో ఉపయోగించి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

*మెంతులలో సపోనిన్లు, ఫ్లేవనాయిడ్స్, ఆల్కనాయిడ్స్ ఉండి తెల్ల రక్త కణాలను పెంచి వైరస్‌లతో పోరాడుతాయి.

*జ్వరం, జలుబు దగ్గుతో బాధపడేవారు అల్లం టీ తాగితే బ్యాక్టీరియాలు ఏర్పడి వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది.

*పసుపులో అంటువ్యాధులతో పోరాడే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పసుపు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.

*లవంగాల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ. వీటిని ప్రతి రోజూ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

Advertisement

Next Story