- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉమెన్స్ డే స్పెషల్ : ప్రతి మహిళ తప్పనిసరిగా చేయించుకోవలసిన ఆరోగ్య పరీక్షలు ఇవే!
దిశ, ఫీచర్స్ : మహిళల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుద్దీ. భూదేవికి ఉన్న ఓర్పు సహనంతో ఎన్నో కష్టాలను, నష్టాలను కూడా లెక్క చేయకుండా తన కుటుంబం కోసం పాటుపడేది స్త్రీ. ఇక ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి మహిళ స్పెషల్ కేర్ తీసుకుంటుంది. కానీ తన వరకు వచ్చే వరకు కాస్త వెనకడుగు వేసి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అందువలన ఉమెన్స్ డే స్పెష్‌ల్‌గా మహిళలు కొన్ని ఆరోగ్య పరీక్షలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి అంటున్నారు నిపుణులు.
భారతదేశంలో లక్షలాది మంది జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.ముఖ్యంగా మహిళలు తమకు తెలియకుండానే కొన్ని రకాల క్యాన్సర్, గర్భాశయ వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువలన ఆరోగ్యం కోసం స్పెషల్ కేర్ తీసుకొని, మహిళలు కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చునంట. అంతే కాకుండా ఒక వేళ వ్యాధి ఉన్నట్లైతే ప్రాథమిక దశలోనే గుర్తించి తగు చికిత్స తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్యులు.
మహిళలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆరోగ్య అవసరాల గురించి చర్చించాలంట.ప్రస్తుతం వయసు, ఫ్యామిలీ ఆరోగ్య చరిత్ర, వ్యక్తిగత ప్రమాద కారకాల ఆధారంగా కొన్ని వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్య పరీక్షలు అనేవి ప్రతి సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ఉత్తమం. వైద్య పరీక్షలు సమస్యలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, డాక్టర్ ఆకార్ పూర్ మీడియాతో తెలిపారు. ఆమె ప్రతి మహిళా చేసుకోవాల్సిన కొన్ని రకాల ఆరోగ్య పరీక్షల గురించి తెలిపారు.అవి ఏమిటంటే?
పూర్తి రక్త గణన (CBC)
HbA1cతో సహా డయాబెటిస్ ప్యానెల్
థైరాయిడ్
కాలేయ పరీక్ష
ముఖ్యమైన పోషకాల అంచనా (విటమిన్లు B & D వంటివి)ఎలక్ట్రోలైట్ ప్యానెల్
బోన్ మినరల్ టెస్ట్ (కాల్షియం , ఫాస్పరస్ స్థాయిలను అంచనా వేయడం)
క్యాన్సర్ స్క్రీనింగ్ 40 సంవత్సరాల తర్వాత, మహిళలకు మామోగ్రామ్, పాప్ పరీక్ష మరియు పురుషులకు PSA (ప్రోస్టేట్-నిర్దిష్ట యాంటిజెన్) కలిగి ఉంటుంది.
ఎకోకార్డియోగ్రఫీ, TMT (ట్రెడ్‌మిల్ టెస్ట్), బోన్ మినరల్ డెన్సిటీ (BMD) అంచనాతో సహా కార్డియాక్ మూల్యాంకనం
అయితే ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశ్యం వ్యాధులను నివారించడమే, అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను ముందస్తుగా గుర్తించి తగు చికిత్స తీసుకోవడానికి ఉపయోగపడుతాయని డాక్టర్ తెలిపారు. అలాగే మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు.