సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండాలా.. ఈ టిప్స్ పాటించండి!

by Jakkula Samataha |
సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండాలా.. ఈ టిప్స్ పాటించండి!
X

దిశ, ఫీచర్స్ : ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. దీంతో ప్రజలందరూ 10 దాటితే బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. ఇక అధిక వేడితో చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వేసవి అంటేనే,చెమటలు, చర్మం పొడిబారడం,డీ హైడ్రేషన్‌తో బాధపడటం, నీరసం ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అందువలన సమ్మర్‌లో కొన్ని హెల్త్ టిప్స్ పాటించడం వలన ఆరోగ్యంగా అలాగే అందంగా కూడా ఉంటారంట.కాగా, సమ్మర్‌లో పాటించాల్సిన టిప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

  • సమ్మర్‌లో వడదెబ్బ నుంచి మిమ్ముల్ని మీరు రక్షించుకోవడానికి ఎక్కువగా విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్, బెర్రీస్ తినడం అలాగే విటమిన్ ఇ అధికంగా ఉండే గింజలతో కూడిన సలాడ్స్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

  • వేసవి కాలంలో కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండ తీవ్రత కళ్ల మీద పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన కళ్ల చుట్టూ పెళుసుగా అవ్వడం. సూర్యరశ్మి ప్రభావంతో కళ్ళు మసకలు బారిపోవడం జరుగుతుంది. అందువలన బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. అలాగే దోసకాయ ముక్కలను గుండ్రగా కట్ చేసి కంటిపై పెట్టుకోవాలి. కళ్లకు వేడి తీవ్రత ఎక్కువగా అనిపించినప్పుడు కాటన్ ప్యాడ్స్ వాడటం మంచిది.

  • సమ్మర్‌లో నల్లటి బట్టలు అస్సలే ధరించకూడదు. అలాగే స్పైసీ ఫుడ్, కూల్‌గా ఉండే ఐస్ క్రీమ్స్‌కు చాలా దూరంగా ఉండాలి.

  • వేసవిలో ఎక్కువగా బయటకు వెళ్లే సమయంలో కాటన్ దుస్తులు, తెల్లటి వస్త్రాలు ధరించడం మంచిది.

  • వేసవిలో ఏదైనా పని మీద బయటకు వెళ్లి వచ్చినప్పుడు మన శరీరం చెమటతో తడిచిపోతుంది.అధిక చెమట పట్టిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేయడం మంచిదంట. దీని వల్ల చర్మాన్ని అన్ బ్లాక్ చేయడంలో ఇది సహాయపడుతుంది. దీని వలన మొటిమలు రాకుండా ఉంటాయి.

  • హైడ్రేట్‌గా ఉండటానికి ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. అంతే కాకుండా తప్పనిసరిగా బ్యాగ్‌లో వాటర్ బాటిల్, కర్చీఫ్ ఉండేలా చూసుకోవాలంట.

  • సమ్మర్‌లో ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కొబ్బరి బోండాలు, నిమ్మరసం తాగడం ఆరోగ్యకరం అంటున్నారు వైద్యులు.
Advertisement

Next Story

Most Viewed