తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. దేశంలో గంటకు ఆరుగురు పిల్లలకు క్యాన్సర్

by GSrikanth |
తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. దేశంలో గంటకు ఆరుగురు పిల్లలకు క్యాన్సర్
X

దిశ, వెబ్‌డెస్క్: మారిన జీవనశైలి మరియు వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల ఫురుషులు, మహిళలు అనే లింగభేధం లేకుండా ప్రస్తుతం చాలా మంది అనేక రకాల క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్‌ ఎవరికి ఎప్పుడు, ఎందుకు, ఎలా వస్తుందో చెప్పలేము. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా రావొచ్చు. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక, రొమ్ము, శ్వాసకోశ, ప్రోస్టేట్‌, పేగు, జీర్ణశయ, కాలేయ క్యాన్సర్‌ల వంటి దాదాపు 100కు పైగా క్యాన్సర్‌ రకాలు ఉన్నాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా, ఏటా కోటి మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మన దేశంలో, ప్రతి సంవత్సరం సుమారు పదకొండు లక్షల మందికి క్యాన్సర్ సోకినట్లుగా నిర్ధారణ అవుతోందని చెబుతున్నారు. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వీటిలో మొదటి వరుసలో ఉంటున్నాయని తెలిపారు.

ఇదిలా ఉండగా.. తాజాగా.. క్యాన్సర్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సంచలన నివేదిక వెల్లడించింది. దేశంలో ఏటా 50 వేల మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారని WHO ప్రకటించింది. దీని ప్రకారం గంటకు ఆరుగురు, పది నిమిషాలకో చిన్నారి క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపింది. వీరిలో 43.02 శాతం మంది బ్లడ్ క్యాన్సర్ బాధితులే ఉన్నారని పేర్కొంది. ప్రపంచంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న 21 ఏళ్లలోపు వారిలో 20 శాతం మంది భారత్‌లోనే ఉండటం ఆందోళనకరమైన అంశమని సూచించింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యానికి మేలు చేసే అహారం తీసుకోవాలని WHO హెచ్చరించింది.

Advertisement

Next Story