వేసవిలో థైరాయిడ్ సమస్యకు ఇలా చెక్ పెట్టండి!

by samatah |   ( Updated:2023-03-16 14:10:17.0  )
వేసవిలో థైరాయిడ్ సమస్యకు ఇలా చెక్ పెట్టండి!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది మహిళలు థైరాయిడ్ భారీన పడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే థైరాయిడ్ ఉన్న వారు తమ ఆహారం కొన్ని మార్పులు చేసుకోవడం వలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చంట. ముఖ్యంగా ఇప్పుడు సీజన్ మారుతుంది.

ప్రస్తుతం వేసవి కాలం మొదలైంది. దీంతో థైరాయిడ్ పేషెంట్స్, డీ హైడ్రేషన్‌కు లోనవ్వడం, అలసట లాంటి సమస్యల భారినపడుతుంటారు. అందువలన ఈ సీజన్‌లో థైరాయిడ్ రోగులు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వలన అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

పైనాపిల్ :పైనాపిల్‌లో విటమిన్ బి, సి మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన థైరాయిడ్ పేషేంట్స్ వేసవిలో పైనాపిల్ తీసుకోవడం ద్వారా విటమిన్ బి, అలసటను దూరం చేస్తుంది. థైరాయిడ్ లక్షణాలను తగ్గిస్తుంది.

ఆరెంజ్ : ఆరెంజ్‌లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. హైపోథైరాయిడ్‌తో బాధపడే వారు ఆరెంజెస్ ఎక్కువ తీసుకోవాలి. దీని వలన హార్మోన్ స్థాయిలను నియంత్రించి, ఆందోళన, రక్తపోటు, డిప్రెషన్ వంటివి లేకుండా చూస్తుంది.

ఆపిల్ :ఆపిల్ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి సహాయపడుతుంది. ఆపిల్‌లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది.ఇది థైరాయిడ్‌ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ల సంశ్లేషణ, విడదలను నియంత్రిస్తుంది. యాపిల్స్‌‌లో ఉండే ఫైబర్ మిమ్మల్ని ఎక్కువ కాలం సంతృప్తిగా ఉంచుతుంది.

Also Read..

ఆ కన్ను అదిరితే శుభమా.. అశుభమా?

Advertisement

Next Story

Most Viewed