పాలిచ్చే తల్లులకు బిగ్ అలర్ట్.. మీరు స్వీట్ తింటే బిడ్డకు షుగర్ వచ్చే ప్రమాదం!

by Jakkula Samataha |
పాలిచ్చే తల్లులకు బిగ్ అలర్ట్.. మీరు స్వీట్ తింటే బిడ్డకు షుగర్ వచ్చే ప్రమాదం!
X

దిశ, ఫీచర్స్ : అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. తల్లి తన కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసినప్పటి నుంచి ఆ బిడ్డ పెరిగి పెద్దది అయినా తన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటుంది. అంతే కాకుండా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే తాను తీసుకునే ఆహారం వలన బిడ్డకు ఎక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయో అని ఆ తల్లి భయపడుతుంది. అయితే కొంత మంది ప్రెగ్నెన్సీ సమయంలో లేదా, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎక్కువ స్వీట్ తింటే బిడ్డకు షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందువలన స్వీట్స్ అస్సలు తినకూడదు అని చెబుతారు. కాగా, దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్యుల సూచన ప్రకారం.. గర్భధారణ సమయంలో, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా మహిళా తప్పకుండా మంచి పోషకాహారం తీసుకోవాలంట. అంతే కాకుండా ఇద్దరికీ సరిపడా ఆహారం తీసుకున్నప్పుడే బిడ్డ, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారంట. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.

అయితే కొంత మంది పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎక్కువగా స్వీట్స్, కూల్ డ్రింక్స్, జంగ్ ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. కానీ దీని వలన శిశువులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్వీట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వలన శిశువు ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే బాలింతలు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ వారు తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ( నోట్ : పై వార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Advertisement

Next Story