- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రికి రాత్రే అందంతో అద్భుతం చేయాలా.. ఇలా చేయండి!
దిశ, ఫీచర్స్ : అమ్మాయిలు అందంగా,నిగారింపుగా ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది.అందువల్లనే అమ్మాయిలు తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అంతే కాకుండా మార్కెట్‌లో దొరికే క్రీమ్స్ వాడుతూ..తమ చర్మాన్ని పాడు చేసుకుంటారు.అయితే ఇంట్లోనే ఈ చిట్కాలు పాటిస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా,మెటిమలు కూడా ఉండవంట. కాగా, అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందంట. కొబ్బరి నూనెలో ఆముదం మిక్స్ చేసి రోజూ ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వలన ఫేస్ నీట్‌గా క్లీన్‌గా ఉంటుంది.వేసవి కాలంలో ముఖం జిడ్డుగా తయారవుతుంది. అయితే ఈ సమయంలో కొబ్బరి నూనెలో ఆముదం కలిపి రాత్రి సమయంలో ఫేస్‌కు అప్లైచేసి పడుకుంటే, చర్మం పై ఉన్న టాన్ తగ్గి, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా తెల్లవారేసరికి అందంగా కనిపిస్తారంట. అలాగే కొబ్బరి నూనెలో ఆముదం కలిపి ఉదయం స్నానం చేసే ముందు ఫేస్‌కు అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత స్నానం చేస్తే, మొటిమలు తొలగిపోతాయి. ముఖం అందంగా,కాంతివంతంగా తయారవుతుంది. అదేవిధంగా ముఖంపై ముడతలు లేదా సన్నని గీతలు వంటి కనిపించినా, రాత్రి పడుకునే సమయంలో ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించడమే కాకుండా ముఖంపై వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి.