- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలో మజ్జిగ తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి కాం కావడంతో, కాసేపు పని మీద బయటకు వచ్చినా సరే, ఎండ వేడిని తట్టుకోలేక, అలసట, నీరసానికి గురి అవుతుంటారు. అంతే కాకుండా వేసవి కాలంలో తిన్న ఆహారం త్వరగా జీర్ణయం కాక, అసిడిటీ లాంటి సమస్యలు ఏర్పడుతాయి.అయితే వేసవి కాలంలో మజ్జిగ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అంతే కాకుండా వేసవిలో ప్రతి రోజు మజ్జిగ తాగడం వలన శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుందంట. కాగా, వేసవిలో మజ్జిగ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
- మజ్జిగ తీసుకోవడం వల్ల ప్రొటీన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బీ12, ప్రొబయాటిక్ అందుతాయి. వీటితో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది.
- వేసవిలో చల్లచల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. ఎండలో తిరిగి వచ్చే వారు ఇంటికి చేరుకోగానే చల్లని మజ్జిగలో నిమ్మకాయ పిండుకుని తాగితే వడదెబ్బ బారినపడకుండా ఉంటారు. అలాగే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు. శరీరంలో ద్రవాల స్థాయి సమతూకంలో ఉంటాయి.
- బరువు తగ్గాలని అనుకునే వారికి మజ్జిగ మంచి ఔషధం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పెరుగుకు బదులు మజ్జిగ వాడుకోవాలి.
- మజ్జిగను తాగడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. జీర్ణసమస్యలు పోతాయి. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story