Be Alert: ఈ బ్లడ్ గ్రూప్ వారు చికెన్ తింటే అంతే ఇక!

by D.Reddy |
Be Alert: ఈ బ్లడ్ గ్రూప్ వారు చికెన్ తింటే అంతే ఇక!
X

దిశ, వెబ్ డెస్క్: మాంసం ప్రియులకు వారంలో ఒక్కరోజైన నాన్ వెజ్ ఉండాల్సిందే. లేదంటే ముద్ద దిగదు. ఇక మాంసాహారుల్లో ఎక్కువ మంది చికెన్ ఇష్టంగా తింటారు. అయితే, వైద్యులు మాత్రం బ్లడ్‌ గ్రూప్‌ని బట్టి చికెన్‌, మటన్‌ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా కొన్ని బ్లడ్‌ గ్రూప్స్ వారు అస్సలు చికెన్, మటన్ తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. మనకి బ్లడ్‌ గ్రూప్‌లు నాలుగు రకాలు ఉంటాయి. అవే O, A, B, AB. ఈ బ్లడ్ గ్రూప్‌ను అనుసరించి తినే ఆహారం జీర్ణం అవుతుంది. అందరూ చికెన్, మటన్‌ను సులభంగా జీర్ణించుకోలేరు. అందుకే కొన్ని బ్లెడ్ గ్రూప్‌ల వారు మాంసాహారాన్ని తగ్గించాలని చెబుతున్నారు.

A బ్లడ్ గ్రూప్..

ఈ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వీరి జీర్ణక్రియ శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే A బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. అందుకే వీరు చికెన్, మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి.

B బ్లడ్ గ్రూప్..

ఈ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యం.

AB, O బ్లడ్ గ్రూప్..

ఈ రక్త గ్రూప్‌ల వారు చికెన్, మటన్‌ను సమతుల్యంగా తినాలి. అంటే అతిగా తింటే ప్రమాదమే. మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు.

శాఖాహారమైనా, మాంసాహారమైనా మంచి, చెడూ రెండూ ఉంటాయి. అందుకే మన శరీరానికి ఏది ఎలాంటి ప్రయోజనం చేకూర్చుతుంది. ఆ ఆహారాన్ని తినేటప్పుడు ఇంతకు ముందు తినప్పుడు ఏమైనా అయిందా లేదా అని చూసుకోవటం మంచిది. అంతేకాదు, మీ బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహార నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవానాన్ని పొందవచ్చు.

Next Story