- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్పిరిన్ టాబ్లెట్ గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం రోజు రోజుకు గుండెపోటు మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో కొందరు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించడానికి వాడే ఆస్పిరిన్ ట్యాబ్‌లెట్ వాడుతున్నారు. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ముందు వరుసలో ఉంటుంది అంటారు. అయితే ఈ ట్యాబ్‌లెట్ ఎంత మోతాదులో వాడితే మంచిది? ఇది అధిక రక్తపోటు, కొలెస్ట్రాలను తగ్గించ గలిగితే దీనిని ఎప్పటికీ వేసుకోవచ్చా? అసలు ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్పిరిన్‌లో రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉన్నాయి. గుండెలోని ధమనులు రక్తం గడ్డకట్టేదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.కానీ ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో పూతలు, లేదా రక్తస్రావం కూడా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు గుండె జబ్బుల నివారణ కోసం ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. కాగా, గుండె జబ్బుల నివారణలో ఇది అంత ఎఫెక్ట్‌వ్‌గా పని చేయడం లేదని, పరిశోధకులు తెలియజేస్తున్నారు.10 దేశాలలోని 47 వేలకు పైగా రోగులపై జరిపిన పరిశోధనలో ఆస్పిరిన్ గుండెపోటు లేదా స్ట్రోక్ తర్వాత మాత్రమే వేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ట్యాబ్‌లెట్స్ వేసుకున్న వారిలో వేసుకోని వారిలో పెద్ద తేడా ఏం కనిపించలేదని వారు పేర్కొన్నారు.