సరిగా ఉడకని అన్నం తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా?

by Jakkula Samataha |
సరిగా ఉడకని అన్నం తినడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మన భారతదేశం అంటే వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశంలో ఎక్కువగా వరి ఇంకా గోధుమ పండిస్తారు. ఇందులో చాలామంది కూడా అన్నం ఆహారంగా తీసుకుంటారు. కొంతమంది రోజులో త్రీ టైమ్స్ అన్నమే తింటే మరికొందరు ఉదయం టిఫిన్, చేసి, మధ్యాహ్నం, రాత్రి రైస్ తింటుంటారు. ఇక అన్నం లో ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్‌ అనేవి ఉంటాయి.ఇక ఇవి శరీరానికి కావల్సిన శక్తిని బాగా అందిస్తాయి.

అయితే అన్నం ఎవరయినా వండుకుంటారు. కొందరు గ్యాస్, కుక్కర్లో వంట చేసుకుంటే మరికొందరు పొయ్యి మీద వంట చేసుకొని తింటారు. ఇక అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు అవి ఏంటో ఇప్పుడు తెలుుకుందాం. ఇక ఈ రోజులో మనం తినే ఆహారాలు ఎక్కువగా అనేక రసాయనాలతో నిండి ఉంటున్నాయని అందరికి తెలుసు. మన జీవనశైలిలో మనకు తెలియకుండానే ఈ హానికరమైన రసాయనాలను మనం తీసుకుంటున్నాం. అయితే ఫ్యూచర్ లో ఇది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుందంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మనం వండుకునే బియ్యం సరిగ్గా ఉడకకపోతే చాలా ఇబ్బందులు తలెత్తుతాయంట. ఉడకకుండా తినడం వలన క్యాన్సర్ బారిన పడి, చనిపోయే ప్రమాదం ఉన్నదంట. అందువలన తప్పనిసరిగా, అన్నాన్ని తప్పనిసరిగా ఉడికించి తీసుకోవాలంటున్నారు నిపుణులు. అంతే కాకుండా బియ్యాన్ని నీటిలో నానబెట్టి తీసుకోవడం ఇంకా మంచిదంట. దీనివలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవంట.

Advertisement

Next Story

Most Viewed