ఈ ఆరు లక్షణాలు మీలో ఉన్నాయా..? లేకుంటే మీ ఆరోగ్యం జాగ్రత్త!

by Kalyani |
ఈ ఆరు లక్షణాలు మీలో ఉన్నాయా..? లేకుంటే మీ ఆరోగ్యం జాగ్రత్త!
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్ని సంపదలు ఉన్నా.. జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా.. మన ఆరోగ్యం బాగలేకపోతే ఆ జీవితాన్ని తృప్తిగా ఆస్వాదించలేమనేది నిజం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ప్రస్తుతం ఎవరు ధనవంతులు అని ప్రశ్నిస్తే ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారు అని ఠక్కున చెప్తారు. డబ్బులు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారు అనేకమంది సమాజంలో ఉన్నారు. సగటున 100 మందిలో 70 మంది రక రకాల అనారోగ్యాలతో బాధ పడుతున్నారు అంటే ఎంతగా రోగాలు పెరిగాయే అర్థం చేసుకోవచ్చు. ఇక దీర్ఘవ్యాధులు అయిన డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు మన సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. ప్రస్తుతం పెరిగిపోతున్న రోగాల దెబ్బకు ఆరోగ్యంపైన కూడా ప్రజల్లో శ్రద్ధ పెరుగుతుంది.

ఈ ఆరు ఆరోగ్య లక్షణాలు మీలో ఉంటే ఆరోగ్యమైన జీవితం మీ సొంతమవుతుంది. అవి ఏంటంటే బాగా నిద్ర పోవడం, సరిగ్గా ఆకలి వేయడంతో పాటు తిన్న ఆహారం ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణం కావడం, రోజూ మల విసర్జన సాఫీగా జరగడం, పొట్టతో పోల్చితే ఛాతీ చుట్టుకొలత ఎక్కువగా ఉండటం, చేసే పనిని ఎంజాయ్ చేయడం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు ఆరోగ్యవంతులని గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకుంటే వాటిని సాధించడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నించండి.

Read More..

ఆ ఫీలింగ్స్‌ వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు.. కారణం ఏంటంటే

10 నిమిషాల కంటే టాయిలెట్‌లో ఎక్కువ సేపు గడుపుతున్నారా? అయితే ఈ వ్యాధి బారిన పడినట్లే!

Advertisement

Next Story