ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్‌కు తూట్లు..ఈటల రాజీనామా చేయాలి

by Shyam |
ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్‌కు తూట్లు..ఈటల రాజీనామా చేయాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను దిగజార్చడమే కాకుండా, ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్‌కు తూట్లు పొడిచినందున ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. కరోనా వైరస్‌ను ఇలానే వదిలేస్తే కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగే ప్రమాదం ఉందని, కావున ప్రభుత్వ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆరోగ్య సంక్షోభం సమయంలో హెల్త్ మినిస్టర్ పనితీరు సరిగా లేదని, ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాల ప్రకారం టెస్టులు చేస్తున్నామని చెబుతూ ప్రతిపక్షాలను, మీడియాను, ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. రోజువారి బులెటిన్లలో ఐసీఎమ్ఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ టెస్టుల డేటాను రిలీజ్ చేయడం లేదని ఆరోపించారు.

దేశంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా కేసులు, మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తూ నివేదికలు విడుదల చేస్తుందని విమర్శించారు. మే 15వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22,842 పరీక్షలు మాత్రమే నిర్వహించగా, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ పరీక్షలు చేశాయన్నారు. విపత్కర పరిస్థితుల్లో కొవిడ్-19 టెస్టులను ఎందుకు తక్కువ చేస్తున్నారో సీఎం కేసీఆర్ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed