ధర్నాలు చేసేవారు మనుషులే కాదు :ఈటెల

by Shyam |
ధర్నాలు చేసేవారు మనుషులే కాదు :ఈటెల
X

దిశ తెలంగాణ బ్యూరో : కరోనా విజృంభిస్తున్న విపత్కర సమయంలో ధర్నాలు చేసేవారు మనుషులే కాదని వైద్యారోగ్య శాఖ మంత్రి విమర్శించారు. ధర్నాల వలన ఎంతో మంది పేద రోగులకు నష్టాలు చేకూరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టిమ్స్ ఆసుపత్రిలో బుధవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. పేషేంట్ల పరిస్థితి సీరియస్ గా ఉంటేనే గాంధీకి పంపిస్తున్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా, సరిహద్దు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటం తో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తగిన చర్యలు చేపడుతుందన్నారు.

గతంలో 15-20 శాతం మంది కరోనా రోగులు హాస్పిటల్ లో చేరేవారని కానీ ప్రస్తుతం 95 శాతం మంది రోగులు ఎలాంటి లక్షణాలు లేకున్నా ఆసుపత్రిలో చేరుతున్నారని చెప్పారు. దీని వలన సీరియస్ గా ఉన్న రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గవర్నమెంట్ లెక్కప్రకారం బెడ్స్, మందులు అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఇతర ప్రైవేట్ లో 14 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని ఈ సారి వాటిని అన్నిటినీ ఉపయోగించుకుంటున్నమన్నారు. సీరియస్ ఉన్న రోగులకు మాత్రమే చికిత్సలు చేయాలని ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందికి సూచించినట్టు తెలిపారు. సిబ్బంది కొరత లేదని అవసరం ఉన్న దగ్గర కొత్త వారిని తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. టిమ్స్ ఆసుపత్రి లో ప్రస్తుతం 450 మంది పేషంట్లు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు

Advertisement

Next Story

Most Viewed