- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య సిబ్బంది మూవ్ టు "టిమ్స్"!
దిశ, ఆదిలాబాద్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కేసులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏర్పాటు చేసింది. అయితే, ఈ టిమ్స్ సిబ్బంది కొరతతో బాలారిష్టాలు ఎదుర్కొంటున్నది.
గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రం నలుమూలల నుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ పోయిన నేపథ్యంలో ఇప్పటికే గాంధీ దవాఖానా నిండిపోయింది. రాబోయే రోజుల్లో సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం టిమ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఆస్పత్రిలో ఉండే సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సుమారు 1,500 బెడ్‌లతో ఆస్పత్రిని ఆధునీకరించారు. కానీ, ఇక్కడ సిబ్బంది నియామకం విషయంలో మాత్రం అవస్థలు ఎదురవుతున్నాయి. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని జిల్లాల నుంచి వైద్య సిబ్బందిని డిప్యూటేషన్‌పై టిమ్స్‌కు రప్పిస్తోంది. రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉన్న సిబ్బందికీ డిప్యూటేషన్ ఇవ్వడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.
భారీగా డిప్యూటేషన్‌లు..
హైదరాబాద్ గచ్చిబౌలి టిమ్స్ దవాఖానాకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ భారీగా డిప్యూటేషన్‌లను ప్రకటించింది. సిబ్బంది సమస్యను అధిగమించేందుకు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ భారీ ఎత్తున వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి డిప్యూటేషన్ ఆర్డర్లు ఇచ్చింది. రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి వైద్య అధికారులు, సిబ్బందిని గచ్చిబౌలి దవాఖానాలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 72 మంది డాక్టర్లు, 150 మంది స్టాఫ్ నర్సులు, 17 మంది ల్యాబ్ టెక్నీషియన్లను వివిధ జిల్లాల నుంచి గచ్చిబౌలి దవాఖానాకు రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సంబంధిత జిల్లా వైద్యాధికారులు డిప్యూటేషన్ ఇచ్చిన వైద్యులు సిబ్బందిని వెంటనే రిలీవ్ చేయాలని రాష్ట్ర డైరెక్టర్ ఆదేశించారు.
రెడ్ జోన్ జిల్లాల నుంచి కూడా..
వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి డిప్యూటేషన్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం కొన్ని ప్రమాణాలు పాటించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని జిల్లాల నుంచి వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని డిప్యూటేషన్ వేశారు. రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఈ జిల్లాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఈ జిల్లాల నుంచి వైద్యులు సిబ్బందిని డిప్యూటేషన్ వేయడం ఏంటని పలువురు అడుగుతున్నారు.
Tags: health dept staff, districts, going, deputation, hyderabad, tims