- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ యువతకు ఆరోగ్యశాఖ కీలక సూచన
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వైరస్యువత నుంచే పెద్దలకు వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో తిరిగే యువత తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నది. పెద్దలను కాపాడుకోవాలని బాధ్యత యువతకు ఉన్నదని ఆరోగ్యశాఖ సూచించింది. కరోనా పూర్తిగా కనుమరుగయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని నొక్కి చెప్పింది. మొదటి, రెండు వేవ్‌లలోని పాజిటివ్‌లను పరిశీలించిన అధికారులు, 30 సంవత్సరాల వయస్సు కలిగిన వారితోనే ఎక్కువ వ్యాప్తి జరిగినట్లు ప్రకటించారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏజ్‌గ్రూప్‌కు చెందిన వారిలో సుమారు 40 శాతం మంది వైరస్‌బారిన పడగా, వీరు మరో 25 శాతం మందికి అంటించినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగం, వ్యాపారం, చదువులు, తదితర కారణాలతో జనసమ్మర్ధ ప్రదేశాల్లో తిరిగే సమయంలో కరోనా నిబంధనలు పాటించకపోవడంతోనే వారంతా ఇన్ఫెక్ట్ అయినట్లు స్పష్టం చేశారు. దీంతో సదరు వ్యక్తుల ఇళ్లల్లో ఉండే వృద్ధులు, ఇతర పెద్దలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాప్తి చెందినట్లు అధికారులు చెప్పారు.
చిన్నారుల నుంచి కూడా..
ఒకవేళ థర్డ్ వేవ్అంటూ వస్తే చిన్నారులే ఎక్కువగా వైరస్‌బారిన పడే అవకాశం ఉన్నదని పలు సర్వేలతో పాటు డాక్టర్లు, శాస్త్రవేత్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే 2 నుంచి 18 ఏళ్లు లోపు వారికి వైరస్ సోకినా పెద్ద ప్రమాదం లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇమ్యూనిటీ వృద్ధి చెందే సమయంలో వైరస్ ఈ కేటగిరీలపై పెద్దగా ప్రభావం చూపలేదన్నది. కానీ వీరి నుంచి పెద్దలకు సోకితే ప్రమాదమని వైద్యశాఖ హెచ్చరించింది. దీంతోనే ప్రభుత్వాలు చిన్నారులకూ వేగంగా వ్యాక్సిన్‌ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని డీహెచ్డాక్టర్ జి.శ్రీనివాసరావు వివరించారు. మార్గదర్శకాలను రాగానే పిల్లందరికీ వ్యాక్సిన్లు అందిస్తామన్నారు. కానీ అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు, తదితర విద్యాసంస్థల్లో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. తద్వారా పెద్దలకు కాపాడుకోవచ్చని వివరించారు.