- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా కేసులు 1525
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృభణ కొలిక్కిరావడం లేదు. ఏప్రిల్ 23 నుంచి నేటి వరకు ప్రతి రోజూ 60కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం పట్ల వైద్యఆరోగ్య శాఖ ఆందోళణ వ్యక్తం చేస్తోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 5,943 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 62 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,525కి చేరుకుందని తెలిపింది.
కర్నూలు జిల్లాలో 25 కేసులు, కృష్ణాలో 12, నెల్లూరులో 6, విశాఖపట్నంలో 4, కడపలో 4, అనంతపురంలో 4, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 2, ప్రకాశంలో 1, పశ్చిమ గోదావరిలో 1 కేసులు చొప్పున నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1525కి చేరుకుంది.
వారిలో ఇప్పటి వరకు 441 మంది చికిత్స పొందుతూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 33 మంది కరోనా కారణంగా మరణించారని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 1051 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. కాగా, విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించింది.
tags: coronavirus, covid-19, ap, health department