- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బరువు తగ్గేందుకు ఓట్స్ తింటున్నారా?
దిశ, వెబ్‌డెస్క్: ఓట్స్ భారత్‌కు చెందిన పంట కాదు. అయినా వీటిని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బరువు తగ్గేందుకు చాలా మంది ఓట్స్‌ను ఆహారంగా తీసుకుంటారు. ఓట్స్‌లో మంచి పౌష్టికాహారం ఉంటుంది. ఓట్స్‌ను ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఓట్స్‌లో పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా మన శరీరానికి అవసరమయ్యే పోషక విలువలు అందుతాయి. ఓట్స్‌కు జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే కరిగే పీచు పదార్థం రక్తంలోని కొలెస్ట్రాల్‌ను వేరు చేస్తుంది. ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తోంది. అధిక బరువును తగ్గించేందుకు ఓట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఓట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి శరీర వాపును తగ్గిస్తాయి. ఓట్స్‌లో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి బీటా-గ్లూకాన్స్, యాంటీమైక్రోబయాల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఓట్స్ తీసుకోవడం వల్ల చర్మ మృదువుగా, తేమగా ఉంటుంది.
ఓట్స్‌లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికి తోడ్పడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇక అస్తమా, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఓట్స్ ను తరచుగా తీసుకోవడం ద్వారా మధుమేహం, బీపీ అదుపులో ఉంటుంది. మన శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు ఓట్స్‌లో అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే గ్లూటెన్ వల్ల శరీరానికి ఎలాంటి హాని కలగదు అని ఓ పరిశోధనలో తేలింది.