- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అల్లం రసం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు
దిశ, వెబ్‌డెస్క్: మనకు వంటింట్లో దొరికే అల్లం ఒక గొప్ప ఔషధం. ఈ అల్లం కేవలం రుచినే కాదు, ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అల్లం పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అల్లంతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో చూద్దాం..!
అల్లంలో విటమిన్స్, మాంగనీస్, కాపర్ వంటి విలువైన పోషకాలు ఉన్నాయి. ఈ అల్లం రసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. అల్లం రక్తాన్ని పలుచగా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది. దీంతో శరీరంలో రక్తం ప్రవాహం చురుకుగా ఉండి, బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. అల్లం అనేక రకాల నొప్పులను తగ్గించేందుకు సహాయపడుతుంది. పంటి నొప్పి, మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది. అలాగే కీళ్ళవాతం, కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది.
దగ్గు, జలుబు, వికారం వంటి సమస్యలను నివారించేందుకు అల్లం గొప్ప ఔషధం. వీటిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది జలుబును తగ్గించి, తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది.
జీర్ణసమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు అల్లం రసం సేవిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అల్లం రసం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ రాకుండా చూస్తుంది. అల్లంను ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా పొట్ట సంబంధిత ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. జింజర్ జ్యూస్‌ను తరచూ తీసుకోవడం ద్వా మొటిమలను నివారిస్తుంది. ఈ అల్లం రసంను జుట్టుకు పట్టించడం ద్వారా జుట్టు రాలిపోకుండా ఉండడమే కాకుండా పెరుగుదలను వేగవంతం చేస్తుంది. అల్లం కేశాలకు కండీషనర్‌గా పనిచేస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది.