వడ్డీ రేట్లు తగ్గిస్తాం..వ్యక్తిగత రుణాలిస్తాం!

by Harish |
వడ్డీ రేట్లు తగ్గిస్తాం..వ్యక్తిగత రుణాలిస్తాం!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా చాలామంది ఉపాధి కోల్పోవడమే కాకుండా, ఎంతోమంది ఆర్థికంగా బలహీనపడుతున్నారు. ఈ క్రమంలో వినియోగదారులకు అండగా నిలిచేందుకు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాల వడ్డీ రేటును 0.20 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించామని, సవరించిన వడ్డీరేట్లు ఏప్రిల్ 7 నుంచి అమలయ్యాయని పేర్కొంది. మార్పుల తర్వాత ఏడాది కాలవ్యవధి ఉన్న ఫండ్స్ బేస్డ్ లెండింగ్ 7.95 శాతం, మూడేళ్ల కాలవ్యవధి ఉన్న వాటికి 8.15 శాతంగా ఉందని తెలిపింది. ఇదివరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా ఆర్‌బీఐ కీలకమైన వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ రుణాలతో పాటు డిపాజిట్‌లపై కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి.

ఈ క్రమంలోనే… బ్యాంక్ ఆఫ్ బరోడా తమ వినియోగదారుల్లో వాహన, గృహ, తనఖా వంటి రిటైల్ రుణాలు తీసుకుని, క్రెడిట్ స్కోరుని 650 కి పైగా కలిగి ఉన్నవారికి వ్యక్తిగత రుణాలివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ రుణం రూ. 5 లక్షల వరకూ ఇచ్చేందుకు సిద్ధమని, ఐదేళ్ల కాలవ్యవధి ఉండే ఈ రుణాలకు వడ్డీ 10.25 శాతం ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ పరిస్థిత్ని దృష్టిలో ఉంచుకుని నగదు లభ్యత పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది.

Tags: HDFC Bank, lending rate, Banking, Interest Rates, rbi, BoB, Personal Loan, Loan, Bank Of Baroda, Personal Loan, Coronavirus, Baroda Personal Loan, Covid 19

Advertisement

Next Story