Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నారా.. ఇది మీ కోసమే!

by Harish |   ( Updated:2021-12-07 06:43:15.0  )
health insurance
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కరోనా వైరస్ కొత్త కొత్త రూపాలతో మానవాళి మీద దాడి చేస్తుంది. రానున్న కాలంలో మన ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఆర్థికంగా మనకు ముందస్తు సన్నద్ధత అనేది చాలా అవసరం. హాస్పిటల్ ఖర్చులకు ఔషధాల ధరలు, వైద్య పరీక్షలు మొదలైన వాటికి చాలా ఖర్చులు అవుతుంటాయి. మధ్య తరగతి వారు భరించలేని విధంగా హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి. గతంలో పాలసీల గురించి పెద్దగా పట్టించుకోని వారు కరోనా కారణంగా ఇప్పుడు పాలసీలు తీసుకునేందుకు ముందుకొస్తున్నారు.

కరోనా కాలంలో హాస్పిటల్స్ ట్రిట్‌మెంట్ పేరు చెప్పి డబ్బులను దండుకున్నాయి. కొంత మంది హాస్పిటల్ బిల్లులు కట్టలేక తమ ఆస్తులను సైతం అమ్ముకున్నారు. ఇలాంటి టైంలో మీకు ఆర్థికంగా ఓదార్పునిచ్చేది ఏదైనా ఉందా అంటే అది ఆరోగ్య బీమా(Health Insurance) మాత్రమే. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా, ఒత్తిళ్లతో కూడిన ప్రపంచంలో బతకడానికి ముందస్తు ఆరోగ్య బీమా(Health Insurance) చాలా అవసరం.

భవిష్యత్తులో వైద్య ఖర్చులు చాలా వరకు పెరుగుతాయి. ఉదాహరణకు ఈరోజు ఆసుపత్రిలో రూ.4 లక్షలు ఖర్చయ్యే చికిత్సకు పదేళ్ల తర్వాత రూ.16 లక్షలు ఖర్చవుతుంది. 20 ఏళ్ల తర్వాత ఖర్చు రూ.65 లక్షలకు చేరుకుంటుంది. ఇలా ఖర్చులు పెరగడం తప్ప తగ్గే అవకాశం మాత్రం లేదు. ఇలాంటి ఖర్చుల నుంచి తప్పించుకోడానికి తక్కువ ధరలో అధిక విలువ కలిగిన బీమా కోసం ముందుగానే సైన్ అప్ చేయడం మంచిది. ఒక కుటుంబంలో వివిధ వయసుల వారికి వివిధ రకాల పాలసీలు చేయడం ముఖ్యం. సీనియర్ సిటిజన్లకు విడిగా పాలసీ చేయడం ఉత్తమం. వయస్సు పైబడిన వారికి పాలసీ తొందరగా ముగుస్తుంది. పెద్దవాళ్లకు, చిన్న పిల్లలకు విడిగా పాలసీ తీసుకోవడం మంచిది. ఇన్సూరెన్స్‌ పాలసీ 25-30 ఏళ్ల పాటు ఉంటుంది.

తక్కువ వయస్సులో పాలసీ చేసుకోవడం ఉత్తమం. 60 సంవత్సరాల వయస్సులో, పాలసీదారుకు ప్రీ-ఓన్డ్ వ్యాధులు & అనేక హీత్ రిస్క్‌లు ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత నిర్దిష్ట ప్లాన్ కింద, పాలసీదారు అత్యవసర వైద్య పరిస్థితుల కోసం ఎక్కువ కవరేజీని పొందవచ్చు. ఆరోగ్య పరీక్షలు, ఇన్-పేషెంట్ ఆసుపత్రి, ప్రీ & పోస్ట్-హాస్పిటల్ కేర్, అంబులెన్స్ ఛార్జీలు మొదలైన వాటిని వ్యక్తిగత బీమా ద్వారా కవర్ చేయవచ్చు. సగటున, రూ.10 లక్షల వ్యక్తిగత ప్లాన్ విడిగా తీసుకోవడం వలన క్రిటికల్ డిసీజెస్, ప్రీ-యాజమాన్య గరిష్ట ఖర్చులను ఈ పాలసీలో చూసుకోవచ్చు. ఉద్యోగులకు జీవిత బీమా పాలసీలు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వారి నెలవారి జీతం నుంచి కొంత డబ్బును పాలసీలో జమ చేయడం వలన వాళ్ళ రిటైర్‌మెంట్ తర్వాత చాలా ఉపయోగపడుతుంది.

ఎమ్మెల్యే విడదల రజినికి ప్రమోషన్.. క్లారిటీ ఇచ్చేసిన మంత్రి

Advertisement

Next Story

Most Viewed