- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న’
దిశ, స్పోర్ట్స్: ఈ తరం వారిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. స్కూల్ పిల్లల నుంచి ప్రొఫెషనల్స్ వరకూ ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. తాను గతంలో బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు టీంఇండియా పేసర్ మహ్మద్ షమీ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరో క్రికెటర్ కూడా ఇలాంటి విషయాన్నే పంచుకున్నాడు. ‘క్రికెట్‌కు దూరమైన సమయంలో తాను బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించాను’ అని రాబిన్ ఊతప్ప చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఊతప్ప.. ఆ జట్టు నిర్వహించిన మైండ్, బాడీ, సోల్ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ‘2006లో తాను టీం ఇండియా తరపున తొలి మ్యాచ్ ఆడాను.. ఆ తర్వాత తన కెరీర్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. కానీ 2009 నుంచి 2011 మధ్య క్రికెట్‌కు దూరమయ్యా.. అప్పుడు ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా వచ్చేవి’ అని చెప్పాడు. ఆ సమయంలో తాను చాలా నరకం అనుభవించానని, అయితే ఇతర విషయాలపై దృష్టి సారించడంతో అలాంటి ఆలోచనలు దూరం అయ్యాయని అతడు చెప్పాడు.