- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్క చేసిన పనికి కుటుంబం ఇబ్బంది పడింది : హీరో
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ కపూర్ తన సోదరి సోనమ్ కపూర్ చేసిన పనికి ఫ్యామిలీ ఎంతగా సఫర్ అయిందో వివరించాడు. గతంలో దీపికా పదుకొనేతో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న సోనమ్.. రణ్‌బీర్ కపూర్ గురించి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యేలా చేసిన కామెంట్స్ కుటుంబాన్ని టార్గెట్ చేసేందుకు కారణమయ్యాయని తెలిపాడు. ఆ టైమ్‌లో రణ్‌బీర్ అభిమానులు సోనమ్‌తో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని ట్యాగ్ చేసి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తట్టుకోలేకపోయామని చెప్పాడు. అందుకే ఏదైనా కామెంట్ చేసేటప్పుడు అందరినీ దృష్టిలో ఉంచుకోవాలని లేదంటే కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని ఎప్పుడూ చెప్తుంటానని తెలిపాడు.
అనవసర వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలను డీల్ చేయడం తనకు ఇష్టముండదన్న హర్షవర్ధన్.. పదిమందిలో ఒపీనియన్ షేర్ చేసేందుకు ధైర్యం ఉండాలని, అలాంటి ధైర్యం తనకు లేదని స్పష్టం చేశాడు. అయితే మన అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పకపోవడం కూడా ఒక్కోసారి మంచిది కాదని.. ఎదురుదెబ్బలు తినడం నచ్చకపోవడం వల్లే తాను ఇలాంటి కామెంట్స్‌కు దూరంగా ఉంటానని పేర్కొన్నాడు. ప్రజలు కేవలం తన వర్క్ గురించి మాట్లాడుకోవాలే తప్ప, ఇలాంటి రూమర్స్ గురించి కాదని వివరించాడు హర్షవర్ధన్.