జాన్ అబ్రహంను చూస్తే అలాంటి ఫీలింగ్ వస్తుందన్న యంగ్ హీరో

by Shyam |   ( Updated:2021-07-13 06:05:48.0  )
Harshvardhan-Rane,--John-Ab
X

జాన్‌ను చూస్తే అలాంటి ఫీలింగ్.. అంటున్న యంగ్ హీరో

దిశ, సినిమా : ‘హసీన్ దిల్‌రుబా’ సినిమాతో లేటెస్ట్‌గా హిట్ అందుకున్న హీరో హర్షవర్ధన్ రాణే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు. జాన్ అబ్రహం నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘తారా వర్సెస్ బిలాల్’ టైటిల్ కన్‌ఫర్మ్ కాగా.. ఈ యాక్షన్ ఫిల్మ్‌కు హర్షవర్ధన్‌ను రిఫర్ చేసింది తనే కావడం విశేషం. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో జాన్‌ అబ్రహంతో ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకున్నాడు రాణే.

2004లో డెలివరీ బాయ్‌గా వర్క్ చేసిన తాను.. జాన్ అబ్రహంకు హెల్మెట్ డెలివరీ చేశానని చెప్పాడు. ప్రస్తుతం ఆయన తన సినిమాకు ప్రొడ్యూసర్ అయినా సరే.. ఫస్ట్ తనను చూసినప్పుడు ఎలాంటి ఫీల్ కలిగిందో ఇప్పటికీ అలాగే ఉందని, చాలా నర్వస్‌గా అనిపిస్తుందన్నాడు. జాన్ తన భుజాలపై చేయేస్తే ‘ఎప్పుడు వెళ్లిపోతే బాగుండు’ అనుకుంటానని, అడుగులు వెనక్కుపడతాయని చెప్పాడు. ఇప్పటికీ తనను ‘సార్’ అని పిలుస్తానని.. అలా పిలవకూడదని ఆయన చెప్పినా, ఆటోమేటిక్‌గా అలానే వచ్చేస్తుందన్నాడు.

హెల్మెట్ డెలివరీ చేసే సమయంలో తన ఆయిల్ హెయిర్, మొహం మీద పింపుల్స్, డర్టీ బైక్ రైడింగ్ అన్నీ గుర్తున్నాయని చెప్పాడు. జాన్‌తో ఓపెన్‌గా ఉండేందుకు ప్రయత్నించినా.. ఈ జన్మకు అలా చేయలేనేమో అంటున్నాడు హర్షవర్ధన్.

Advertisement

Next Story