- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూత్ ఏం చేయకూడదంటే? : హర్ష్ గోయెంకా
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్ ద్వారా విలువైన సూచనలు, అద్భుతమైన విషయాలను షేర్ చేస్తుంటాడు. కోల్‌కతాలో రీసెంట్‌గా ప్రారంభమైన ‘ట్రామ్‌కార్ లైబ్రరీ’ గురించిన విషయాలతో పాటు డ్రీమ్ 11 ఆఫీస్ కల్చర్ ఎలా ఉంటుందో తెలియజెప్పిన హర్ష్ గోయెంకా.. యూత్ తర్వాత పశ్చాతాప పడకుండా ఉండాలంటే ‘ఆరు’ సూత్రాలు పాటించాలని, అలానే యూత్ నుంచి ఇతరులు ఏం నేర్చుకోవచ్చో కూడా తాజాగా తెలిపాడు హర్ష్ గోయెంకా.
యువత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త తొందరపడతారు. దేన్నయినా ఈజీగా కాలిక్యులేట్ చేసి, ఆ తర్వాత దాని వల్ల వచ్చే పరిణామాలను ఫేస్ చేయలేక భయపడుతుంటారు. అందుకే యువత ఎప్పటికీ రిగ్రెట్ కాకుండా ఉండాలంటే ఓ 6 సూత్రాలు తప్పనిసరిగా ఫాలో కావాలని హర్ష్ తెలిపాడు. అవి..
1. అప్పులకు దూరంగా ఉండండి
2. పేరు ప్రఖ్యాతలను సంపాదించగల లేదా పరపతి పొందగల నైపుణ్యాలను తెలుసుకోండి
3. సోషల్ మీడియాను తెలివిగా ఉపయోగించుకోండి
4. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించండి..
5. ఇతరుల అభిప్రాయాల గురించి బాధపడకండి
6. నేర్చుకోవడం లేదా అనుభవాల మీద దృష్టి పెట్టండి
What we can learn from our young ones:
1. They are curious and keep on learning
2. They make friends easily
3. They dream and for them everything is possible
4. They don’t bother of what others think
5. They derive happiness from whatever they do
6. They let go of grudges easily— Harsh Goenka (@hvgoenka) November 29, 2020
పాతికేళ్లలోపే యువతీయువకులు జీవితంలో స్థిరపడుతున్నారు, ఎన్నో సాధిస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో రాబోయే తరాలకు, తమ ముందున్న తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకు హర్ష్ యువత నుంచి ఏం నేర్చుకోవచ్చో తెలిపాడు.
1. యువత కొత్త విషయాలను నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు.
2. కొత్తవారితో ఈజీగా స్నేహం చేస్తారు.
3. తమ లక్ష్యం కోసం ఎంతదూరమైనా వెళతారు. అంతేకాదు ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తారు.
4. ఇతరులు ఏమనుకుంటున్నారో వారసలు పట్టించుకోరు.
5. వాళ్లు చేస్తున్న పనిలోనే సంతోషాన్ని వెతుక్కుంటారు, చాలా సంతృప్తిగా ఉంటారు.