సిద్ధిపేటలో హోటల్ యజమానిపై హరీశ్‌రావు సీరియస్

by Shyam |
సిద్ధిపేటలో హోటల్ యజమానిపై హరీశ్‌రావు సీరియస్
X

దిశ, సిద్ధిపేట: సిద్ధిపేట పట్టణంలో రోడ్డు పనులను సోమవారం మంత్రి హరీశా రావు పరిశీలించారు. ఈ క్రమంలో హరీష్ రావు ఒక హోటల్ వద్దకు వెళ్లారు. ఆ హోటల్ లో ఉన్న ప్లాస్టిక్, ప్లాస్టిక్ కవర్ లో కర్రీ పర్సల్ చేయడంపై మంత్రి ఆశ్చర్య పోయారు. ‘ఇదేంటమ్మా.. ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పినా ప్లాస్టిక్ వాడుతున్నారు.. క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చి మనుషుల చస్తారు. నేను కోరేది ఒక్కటే మీకు బ్రతుకు దేరువు ఉండాలి. ప్రజలు బ్రతికేల చూడాలి అంటే ప్లాస్టీక్ బంద్ చేయాలి’ అని యజమానికి సూచించారు. స్టీల్ బాక్స్ , జ్యుట్ బ్యాగ్ తెచ్చుకుంటేనే టిఫిన్ పార్సల్ చేస్తామని చెప్పాలని సూచించారు. అదేవిధంగా మరో చికెన్ సెంటర్ ముందు ఉన్న అపరిశుభ్రతను గమనించిన మంత్రి ఆ చికెన్ సెంటర్ యజమానిపై కూడా సీరియస్ అయ్యారు. అతడిని పిలిచి రేపటి నుంచి షాపు ముందు అపరిశుభ్రత కనపడితే అధికారులు ఫైన్ వేస్తారని చెప్పారు.

Advertisement

Next Story