వారి కష్టాలపై సినీ దర్శకుడి ఆవేదన

by Shyam |
వారి కష్టాలపై సినీ దర్శకుడి ఆవేదన
X

వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. సొంత గడ్డపై బతకలేక బతుకు జీవుడా అని వలస వెళ్తే.. కరోనా పిడుగు ఆ బతుకులపై పిడుగేసింది. అక్కడ బతకలేకుండా చేసింది. దీంతో చావో బతుకో సొంత ఇంటికే పోదాం అంటూ.. ఊరి బాట పట్టారు వలస కార్మికులు. బస్సులు, రైళ్లు లేకపోయినా సరే.. వందల మైళ్ళు నడుచుకుంటూ సొంత గూటికి చేరే ప్రయత్నంలో ఉన్నారు. ఆకలి కేకలు పెడుతున్న అవేవీ పట్టించుకోకుండా.. పగలు రాత్రి తేడా లేకుండా.. నడక సాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో ప్రమాదాలు జరిగి.. మధ్యలోనే పయనాన్ని ఆపేసి శాశ్వత నిద్రలోకి జారుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటి కష్టాలు కన్నీరు తెప్పిస్తుంటే నిస్సహాయతతో ఓ లేఖ విడుదల చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ ..

హరీష్ శంకర్ లేఖ :

” బండరాళ్లను పిండి చేసిన చేతులు
ఎడమపక్క డొక్క నొప్పికి లొంగి పోయాయి
పెద్ద పెద్ద ఇనుప చువ్వలను వచ్చిన వేళ్ళు
మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి
మేం వేసిన రోడ్లే మమ్మల్ని వెక్కిరిస్తుంటే
బతకడం కోసం ఊరొదిలివచ్చిన మేము
చచ్చేలోపు ఊరికెళ్తే చాలనుకుంటూ
ఆకలి అడుగులతో
పేగుల అరుపులతో
కాళ్ళు, కడుపు ఒకేసారి కాలుతుంటే
మమ్మల్ని చూసే లోకులకు
బాధేస్తోంది..
జాలేస్తోంది..
కానీ మాకు మాత్రం ఆకలేస్తోంది”
నిస్సహాయతతో
హరీష్ శంకర్

Advertisement

Next Story

Most Viewed