- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడల్ గా సిద్దిపేట జిల్లా గ్రంథాలయం: హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా ఇప్పటికే అన్నింటిలోనూ ఓ ప్రత్యేకతను సంతిరించుకున్నదనీ, అదే విధంగా జిల్లాలో ఏర్పాటు చేయనున్న గ్రంథాలయ భవనం కూడా రాష్ట్రానికి మోడల్ గా నిలిచేలా నిర్మించాలని రాష్ట్ర ఆర్థికమంత్రి మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట బై పాస్ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న గ్రంథాలయాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషికి మంచి పుస్తకం చదివే అలవాటు కంటే గొప్ప అదృష్టమేదీ లేదనీ, ఆ దిశగానే జిల్లాలోని యువతీయువకులకు, విద్యార్థులకు ఉపయోగపడేలా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నిర్మాణ నమూనాను, పనులను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ప్రత్యేకంగా రీడింగ్ రూమ్ లను ఏర్పాటు చేయాలని పలు సూచనలు చేశారు. డిజిటల్ విభాగం, ముస్లీంల కోసం ఉర్దూ పుస్తకాలు సైతం అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు.