విపక్షాలది మొసలి కన్నీరు: హరీశ్‌రావు

by Shyam |
MInister Harish rao
X

దిశ, మెదక్: తాము రైతుల పక్షాన పనిచేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఏసీ రూముల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రమూ రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదనీ, కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం సేకరిస్తున్నామన్నారు. కుల్చారం మండలం రంగంపేటలో పర్యటించిన హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

Tags: minister harish rao, comments, opposition parties, medak

Next Story

Most Viewed