మరోసారి అలాంటి ఘటనలు నా దృష్టికి వస్తే సహించేదే లేదు.. మంత్రి హరీశ్ రావు

by Shyam |
harish rao
X

దిశ, సిద్దిపేట: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలని, ప్రజా ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా వైద్యులు, వైద్యాధికారులు కృషి చేయాలని మెడికల్ కళాశాల, జిల్లా ఆసుపత్రి అధికారులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కిషోర్ కుమార్, మెడికల్ కళాశాల ఆర్ఏంఓ హేమలత, జిల్లా వైద్య నోడల్ అధికారి డాక్టర్ కాశీనాథ్, గజ్వేల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్‌లతో కలిసి సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇక అన్నీ వైద్య పరీక్షలు వైద్య కళాశాల, జిల్లా ఏరియా ఆసుపత్రిలోనే జరిగేలా చూడాలని, నెల రోజుల్లో సిటీ స్కాన్, రేడియాలజీ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వైద్యాధికారులను ఆదేశించారు.

మెడికల్ కళాశాలలో కావాల్సిన అన్నీ వైద్య పరీక్షలు తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌లో జరిగేలా చూడాలన్నారు. డయాగ్నోస్టిక్ హబ్‌లో చేస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వచ్చే విద్యా సంవత్సరంలో మెడికల్ కళాశాలను పీజీ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు, పీజీ అడ్మిషన్లు జరిగేలా చూడాలని, కావాల్సిన కోర్సులు, ఆసక్తి, డిమాండ్ ఉన్న కోర్సులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆమోదం ఇవ్వాలని వైద్య ఉన్నతాధికారులను ఫోన్లో మంత్రి ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌లో అన్నీ రకాల మందులు అందుబాటులో ఉండాలని, మరోసారి మందులు లేవని తన దృష్టికి వస్తే సహించేది లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed