- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్నకారు రైతులకే తొలి ప్రాధాన్యత: హరీశ్‌రావు
దిశ, మెదక్: మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సిద్దిపేట నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథక కూలీలు పనిచేసే ప్రదేశంలో మీటరు దూరం ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి సిమెంటు కొరత ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సిమెంట్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీనిచ్చారు.
ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో చిన్న, సన్నకారు రైతులకే మొదట ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి మండలానికి రెండు లేదా మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాన్ని జిల్లాలో ఒక్కచోట మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో హైపో క్లోరైట్ స్ప్రే చేయాలన్నారు. ప్రజలు గుమిగూడకుండా ఉండేలా చొరవ చూపాలని ప్రజా ప్రతినిధులను మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ శ్రవణ్, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, డీపీఓ సురేశ్ బాబు, ఏంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
Tags; minister harish rao, teleconference, ts news