- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కసారి గెల్లు శ్రీనివాస్‌కు చాన్స్ ఇవ్వండి: హరీష్ రావు
దిశ, జమ్మికుంట: ‘హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో మీకందరికీ తెలిసిందే.. మీరు ఆరు సార్లు ఓట్లు వేసి గెలిపించిన ఈటల రాజేందర్ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు, ఒక్కసారి గెల్లు శ్రీనివాస్‌కు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం’ అంటూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. శనివారం ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి, వంతడుపుల గ్రామాల్లో హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కుల, మతాలతో సంబంధం లేకుండా సొంత జాగలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు టీఆర్ఎస్ పార్టీ అందజేస్తుందని చెప్పారు. తల్లి పాలుతాగి రొమ్ము గుద్దినట్టు చేసిన ఈటల రాజేందర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలను పెంచిన పార్టీలో ఈటల రాజేందర్ చేరారని, మంత్రిగా ఉన్న సమయంలో ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు కడుపు నింపవని చెప్పిన ఈటల రాజేందర్‌కు ఓటు వేద్దామా, పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని సూచించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు రోడ్డెక్కితే కారు ఎక్కించి చంపుతున్నది బీజేపీ పార్టీ అని, అలాంటి పార్టీని పాతర పెట్టాలని పిలుపునిచ్చారు.