ఐపీఎల్ కోసం హర్భజన్ ఒప్పందం

by Shyam |
ఐపీఎల్ కోసం హర్భజన్ ఒప్పందం
X

దిశ, స్పోర్ట్స్ : వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న సీఎస్కే (csk) జట్టు సభ్యుడు, వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్టార్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. యూఏఈ (UAE)లో జరుగనున్న ఐపీఎల్ కోసం హిందీ కామెంట్రీ అందించనున్నట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా స్టార్ ఇండియా అతడితో ఒక క్రికెట్ షో కూడా రూపొందించనున్నట్లు సమాచారం.

ముంబైలోని స్టార్ ఇండియా (Star India) ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే బయోబబుల్ ఏర్పాటు చేశారు. ప్రొడక్షన్ సిబ్బంది, హిందీ, ఇతర భాషల కామెంటేటర్లు ఈ బయోబబుల్‌లో ఉండనున్నారు. ఐపీఎల్ (IPL) జరిగినన్ని రోజులూ 700 మంది సిబ్బంది ముంబైలోని బయో సెక్యూర్ (Bio Secure) వాతావరణంలో పని చేయనున్నారు. యూఏఈ వెళ్లని హర్భజన్ ఈ బయోబబుల్ లోనే హిందీ కామెంట్రీ అందించనున్నాడని తెలుస్తున్నది. అయితే స్టార్ ఇండియాతో హర్భజన్ ఒప్పందం ఇంకా కుదరలేదని, త్వరలోనే దానికి సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయని జాతీయ మీడియా వెల్లడించింది.

Advertisement

Next Story