డ్రాగన్ కంట్రీపై మళ్లీ భజ్జీ ఫైర్

by Shyam |
డ్రాగన్ కంట్రీపై మళ్లీ భజ్జీ ఫైర్
X

దిశ, స్పోర్ట్స్: భారత్‌తో బాహాబాహీకి సిద్ధమంటూ సంకేతాలిస్తూ ఇప్పటికే 20మంది సైనికులను బలి తీసుకున్న చైనాపై దేశమంతటా వ్యతిరేకత పెరిగిపోతున్నది. మరోవైపు కరోనా వైరస్‌ను ప్రపంచానికి అందించిందనే ఆగ్రహం కూడా ఉంది. ఇప్పుడు మరో వైరస్ కూడా ఆ దేశంలో పురుడు పోసుకుందనే వార్తల నేపథ్యంలో టీమ్‌ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఇదంతా చైనా చేస్తున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు ‘ఇప్పటికే కరోనాతో మేం చస్తుంటే, చైనా మరో కొత్త వైరస్ తయారు చేసిందంటా. యావత్ ప్రపంచం కరోనాతో సతమతమవుతుంటే.. వాళ్లేమో మరో వైరస్ సిద్ధం చేశారు’ అని ట్వీట్ చేశాడు. దానికి రాయిటర్స్ కథనాన్ని జత చేయడమే కాకుండా కర్మరా బాబు అనే అర్థం వచ్చే ఎమోజీలు కూడా పెట్టాడు. గతంలో కూడా హర్భజన్ పలుమార్లు చైనాపై విరుచుకుపడ్డాడు. చైనా యాప్స్, వస్తువులు బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed