‘చిరుత’పులిలా దూసుకెళ్తోన్న ‘మగధీర’కు హ్యాపీ బర్త్ డే

by Anukaran |
Ram Charan
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తేజ్.. ప్రస్తుతం ‘చిరుత’ పులిలా దూసుకెళ్తున్నాడు. తండ్రిదగ్గ తనయుడిగా.. వినూత్న కథనాలతో తనదైన శైలిలో రాణిస్తున్నాడు. మెగా కాంపౌండ్‌లో సెపరేటు రూటు వేసుకుంటున్న ఈ మెగా పవర్ స్టార్‌.. అభిమానులకు రెట్టింపు ఆనందం పంచుతున్నాడు. తొలి చిత్రం చిరుతతో సత్తా నిరూపించుకున్న చరణ్.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘మగధీర’ చిత్రం ద్వారా రికార్డులు తిరగరాయడంతో పాటు చరణ్‌కు స్టార్ స్టేటస్‌ కూడా వచ్చింది. కట్టబెట్టింది. ఆ తర్వాత ‘ఆరెంజ్’, ‘రచ్చ’, ‘నాయక్’ వంటి వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Charan

అంతేగాకుండా… ఫ్యాన్స్ కోరిక మేరకు తండ్రితోనూ పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆకలి తీర్చాడు. తండ్రితో ‘ఖైదీ నంబర్ 150’లో సాంగ్ చిన్న స్టెప్పులేశఆడు. ఆ తర్వాత ‘బ్రూస్లీ’ సినిమాలో చిరు చిన్న గెస్ట్ రోల్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అంతేగాకుండా.. ‘సైరా’ వంటి వరుస సినిమాలను నిర్మించిన రామ్ చరణ్.. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నాడు. ప్రస్తుతం తండ్రితో ‘ఆచార్య’ సినిమాని నిర్మించడమే కాకుండా.. అందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ఈ సమ్మర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందకు రానుంది. ఇప్పటికే రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న RRR చివరిదశకు చేరుకోగా.. అనంతరం వెంటనే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

అయితే… నేడు(శనివారం) రామ్ చరణ్ బర్తే సందర్భంగా ‘ఆచార్య’ సినిమా నుంచి చరణ్ ఫస్ట్‌లుక్ రానుంది. ఇప్పటికే RRR మూవీ నుంచి జక్కన్న అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రసుతం ఈ లుక్‌తో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. చివరగా మెగా వారసుడిగా.. తనదైన పంథా కొనసాగిస్తున్న రామ్‌ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Advertisement

Next Story