ఈటల కాంగ్రెస్‌లో చేరాల్సి ఉండే.. ఏం జరిగిందో రేవంత్ చెప్పాలి : వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

by  |
ఈటల కాంగ్రెస్‌లో చేరాల్సి ఉండే.. ఏం జరిగిందో రేవంత్ చెప్పాలి : వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ధాన్యం కొనుగోళ్లపై టీ-కాంగ్రెస్ చేస్తున్న ధర్నాలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో తప్పు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈటలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరింత లాభం చూకూరేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం ఓ ఫంక్షన్‌లో ఈటలను కలిసినప్పుడు ముందు కాంగ్రెస్‌లోకి వస్తానని అడిగానంటూ చెప్పారన్న వీహెచ్.. ఆ తర్వాత ఏమైందో తెలియదని అన్నారు. ఈటల విషయంలో అసలు ఏమైందో రేవంత్ రెడ్డే చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed