- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెన్షన్ ఇవ్వాలంటూ వీరంగం.. కత్తితో సచివాలయానికి వచ్చి భయపెట్టాడు
దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్ కోసం కాళ్ల చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. కానీ, విశాఖ జిల్లాలో ఓ దివ్యాంగుడు తిరిగి.. తిరిగి అలసిపోయాడేమో.. ఏకంగా కత్తి చేతిలో పట్టుకుని నేరుగా గ్రామ సచివాలయానికే వచ్చేశాడు. ఇస్తారా.. చస్తారా అంటూ వీరంగం సృష్టించాడు.
అసలు సంగతేంటి..?
విశాఖ జిల్లా పరిధి గూడెం కొత్తవీధి మండలం పెదగొంది గ్రామానికి చెందిన వంతల దెబో వికలాంగుడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అతడికి వికలాంగుల పింఛన్ వస్తున్నది. కానీ, గత మూడు నెలలుగా రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి. ఎందుకు రావడం లేదని ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగినా స్పందించలేదు. పెన్షన్ ఆగిపోయిన మొదటి నెల నుంచి మూడో నెల వరకు తిరిగి.. తిరిగి విసుగు చెందాడు.
ఇక లాభం లేదు అనుకుని ఓ కత్తి, కర్రను చేతిలో పట్టుకుని నేరుగా గ్రామ సచివాలయానికి వచ్చేశాడు. కత్తితో తలుపులను నరుకుతూ నా పెన్షన్ ఇస్తారా.. ఇవ్వారా అంటూ వీరంగం సృష్టించాడు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన అధికారులు పెన్షన్ వచ్చేలా చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో వంతల దెబో కూల్ అయ్యాడు. ఇదే విషయంపై అధికారులను ఆరా తీయగా అతడికి రేషన్ కార్డు లేని నేపథ్యంలో పింఛన్ ఆగిపోయిందని అసలు విషయం చెప్పారు.
- Tags
- ap news