- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇటాలియన్ ఓపెన్ విజేత సిమోన హెలెప్
దిశ, స్పోర్ట్స్ : టాప్ సీడ్ సిమోన హెలెప్ తొలి సారి ఇటాలియన్ ఓపెన్ (Italian Open) మహిళ సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ క్యారలీనా పిస్కోవాతో సిమోన హెలెప్ తలపడింది. కాగా, 6-0, 2-1 స్కోరుతో హెలెప్ ముందంజలో ఉన్న సమయంలో పిస్కోవా గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకుంది. వాకోవర్ లభించడంతో హెలెప్ తన తొలి ఇటాలియన్ ఓపెన్ గెలిచింది. డబ్ల్యూటీఏలో భాగమైన ఇటాలియన్ ఓపెన్ ఫైనల్స్‌కు హెలెప్ చేరుకోవడం ఇది మూడో సారి. 2017, 2018లో ఫైనల్స్‌లో ఓడిపోయింది.
మ్యాచ్ గెలిచిన అనంతరం హెలెప్ మాట్లాడుతూ ‘రెండు ప్రయత్నాల అనంతరం ఇటాలియన్ టైటిల్ గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఈ టోర్నమెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఏనాటికైనా ఇటాలియన్ ఓపెన్ గెలుచుకోవాలని అనుకున్నాను. చివరకు ఈ రోజు నా చేతిలో ఈ అందమైన ట్రోఫీ ఉంది’ అని హెలెప్ వ్యాఖ్యానించింది. రన్నరప్ పిస్కోవా మ్యాచ్ ఆసాంతం కోర్టులో ఇబ్బందిగా కదిలింది. తన ఎడమ తుంటికి బ్యాండేజీలు ధరించి ఆట ఆడింది. కానీ రెండో సెట్‌లో నొప్పి తీవ్రంగా బాధించడంతో మ్యాచ్ నుంచి తప్పుకుంది.