- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు మార్గదర్శకాలు
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 30ను జారీ చేసింది. ఆగస్టు 15న ఖైదీలను విడుదల చేయాలని భావించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో కొంత జాప్యం జరిగింది. ఈక్రమంలోనే అక్టోబరు 2న గాంధీ జయంతికి విడుదల చేసేందుకు నిర్ణయించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5800 మంది ఖైదీలు ఉన్నారు. అయితే మహిళా ఖైదీల్లో 8ఏళ్ళలో 6ఏళ్ల శిక్ష పూర్తయిన వారు, పురుషుల్లో 14ఏళ్ళ శిక్షకు 10ఏళ్లు పూర్తయిన వారు, మొత్తం పురుషుల్లో 65ఏళ్ళు పైబడి 8ఏళ్ల శిక్షకు 6ఏళ్ళు పూర్తయిన వారు, మహిళల్లో 60ఏళ్లకు పైబడి 7సంవత్సరాల శిక్షకు 6ఏళ్ళు పూర్తయిన వారికి, జీవిత ఖైదీలు అనుభవిస్తున్న వారిలో పురుషులకు 18ఏళ్లకు 14ఏళ్ల శిక్ష పూర్తయితే, మహిళా ఖైదీలలో 14ఏళ్ల శిక్షకు 10 ఏళ్ళు పూర్తయిన వారికి మార్గదర్శకాలను రూపొందించారు. జైలు నుంచి తప్పించుకున్న వారికి, ఇతర రాష్ట్రాలలో శిక్షలు పడిన వారికి, పీడీయాక్ట్‌లు నమోదు అయిన వారికి మినహాయింపు ఇవ్వలేదు.
చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్‌తో పాటు ఏడు జిల్లా జైళ్ల నుంచి సుమారు 100 నుంచి 150 మంది విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు. అయితే, అక్టోబరు వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందా లేదా అనేది సందేహాస్పదంగా ఉండగా, అక్టోబరు 2 గాంధీ జయంతికి రెండ్రోజులు ఆలస్యమైనా కూడా గాంధీ జయంతిని పురస్కరించుకుని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.