గ్రూప్ 1 అధికారి దీప్తి మృతి

by Shyam |
Group 1 officer Deepti killed
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న గ్రూప్-1 అధికారి జి.దీప్తి గురువారం మృతిచెందారు. స్టేట్ ఆడిట్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దీప్తి పొరుగు సేవల్లో భాగంగా టీఎస్ ఎండీసీలో జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. కరోనా బారిన పడి కిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది.

2007లో ఆడిట్ అధికారిగా…

అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ 1992లో ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జి.కృష్ణ ప్రసాద్ కుమార్తె దీప్తి. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో, పట్టుదల తో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ 2007లో గ్రూప్-1 ఉద్యోగాన్ని సాధించింది. ఆడిట్ అధికారిగా ఎంపికైన దీప్తి ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉన్నత అధికారుల మన్ననలు పొందింది. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ హోదాలో టీఎస్ ఎండీసీలో జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంది.

పలువురి సంతాపం

దీప్తి మృతికి తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం సంతాపం ప్రకటించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, హన్మంత్ నాయక్ కోరారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. సంతాపం ప్రకటించిన వారిలో ఉద్యోగ సంఘాల నేతలు వేణుమాధవ రెడ్డి, విజయ్, పాండురంగా రావు, రమేష్, రేవతి తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed