- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తవ్వుకో… దోచినకాడికి తరలించుకో.. రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పినపాక మండలంలోని ముకుందాపురం గ్రామంలోని ప్రభుత్వ భూమి నుంచి జనాంపేట ఇసుక ర్యాంప్ కు అక్రమంగా గ్రావెల్ తోలుతున్నా.. ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో ఏ ఇసుక ర్యాంపుకు రోడ్డు మార్గం కావాలన్నా ఈప్రభుత్వ భూమి నుంచి గ్రావెల్ తోలుతున్నారని ప్రజలు వాపోతున్నారు. మండలంలో రోజురోజుకి గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ముకుందాపురంలో గ్రావెల్ తవ్వుకో…దోచినకాడికి తరలించుకో అనే విధంగా అక్రమార్కులు వ్యవహారిస్తున్నారని మండల ప్రజలు, పలువురు మేధావులు మాట్లాడుకుంటున్నారు.
అక్రమార్కులు కొండలను పిండిపిప్పి చేస్తున్నా, ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతున్నా ప్రభుత్వ అధికారుల పట్టింపు కరువైందని మండల ప్రజలు, ప్రముఖులు చర్చించుకుంటున్నారు. గ్రావెల్ మాఫియా ఇచ్చే మామూళ్ల మత్తులో మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఊగుతున్నారని ప్రముఖులు వాపోతున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలను, తిప్పలను అక్రమంగా తవ్వి యథేచ్ఛగా గ్రావెల్ వ్యాపారం చేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని మండల ప్రజలు,ప్రముఖ మేధావులు ప్రశ్నిస్తున్నారు.
ఇసుక ర్యాంపులు,ప్రభుత్వ రోడ్లతోపాటు ప్రైవేటు వెంచర్లకు,ఇతర అవసరాలకు కొండమట్టి (గ్రావెల్)అవసరం కాబట్టి, అక్రమార్కులు ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా కొండలను పిండిచేసి గ్రావెల్‌ను అమ్మి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని మండల ప్రజలు,ప్రముఖ మేధావులు తెలుపుతున్నారు. మండలంలోని ప్రజలు,కొంతమంది ప్రముఖులు ఫిర్యాదులు ఇచ్చిన సందర్భంలో రెవెన్యూ అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారే తప్ప,వీరి వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేని పరిస్థితి పినపాక మండలంలో నెలకొందని ప్రజలు,పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులంతా దాదాపు అధికారపక్షానికి చెందినవారు కావడంతో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మండలంలో జోరుగానే వినిపిస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బంది మట్టి తవ్వకాలు జరిగే ప్రాంతానికి వెళ్లి ప్రధాన అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడించి మీకు ఎంత…మాకు ఎంత…అనే విధంగా రహస్యంగా మాట్లాడుకుంటారని, వినకపోతే కేసులు పెడతామని బెదిరిస్తూ జేబులు నింపుకుంటున్నారనే వినికిడి మండలంలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గ్రావెల్ మాఫియాపై కఠిన చర్యలు చేపట్టి, అక్రమార్కులకు సహకరిస్తున్న మండల అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని మండల ప్రజలు, పలు సంఘాలనాయకులు, ప్రముఖ మేధావులు కోరుతున్నారు.
- Tags
- gravel mafia