- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త జిల్లాలకు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయండి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా, జోనల్, మల్టీ జోన్ ఉద్యోగుల విభజన చేపట్టే ముందు నూతన జిల్లాలకు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు జేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. జోనల్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలపై శుక్రవారం సచివాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎం కార్యదర్శి శేషాద్రి, జీఏడీ అధికారులు, పంచాయతీరాజ్ కార్యదర్శి రఘునందన్ రావు,ఆర్థిక శాఖ అడ్వైజర్ శివశంకర్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎస్ కి వినతిపత్రం అందజేశారు.
జోనల్ విభజనలో ఏ ఒక్క ఉద్యోగి సీనియారిటీ నష్టపోకుండా చూడాలని, పాత ఉద్యోగులకు పాత జిల్లా, జోనల్ ని కొనసాగించి కొత్తగా నియామకం జరిగే వారికి కొత్త జోనల్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగుల విభజనకు ముందే అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వారివారి శాఖలకు సంబంధించి ఖాళీగా ఉన్న పోస్టులను మంజూరు చేయాలని, మండలాలు, జిల్లాల వారిగా క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించాలని పేర్కొన్నారు. ఉద్యోగుల భద్రతకు ఒక్క శాతం చందాతో ఆరోగ్య పథకాన్ని అమలు చేసి ఎంప్లయిస్ హెల్త్ స్కీం సౌకర్యాన్ని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలుచేయాలని కోరారు. పీఆర్సీలోని వ్యత్యాసాలను సవరించడానికి అనమలీస్ కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పదోన్నతుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ శాశ్వత ఉత్తర్వులు జారీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
సీఎస్ సానుకూలంగా స్పందించి ప్రమోషన్ కనీస సర్వీసును రెండేళ్లకు కుదించేందుకు, సీనియార్టీ నష్టం జరకుండా చూసేందుకు, అనామలీస్ కమిటీని ఏర్పాటుచేయడం తదితర అంశాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎస్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. సీఎస్ ని కలిసిన వారిలో టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, ప్రతాప్, టీజీవో అధ్యక్ష కార్యదర్శులు మమత, సత్యనారాయణ ఇతర జేఏసీ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, టీజీవో నగర శాఖ అధ్యక్షుడు గన్నూరి వెంకట్, హైదరాబాద్ టీజీవో అధ్యక్షుడు కృష్ణయాదవ్, టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, బుచ్చి రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ముజీబ్, నగర శాఖ అధ్యక్షులు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.